Site icon NTV Telugu

Jagadish Reddy: బీజేపీ ఎజెండా ఇదే.. అందుకే ఈ కుట్ర

Jagadish Reddy On Kavitha C

Jagadish Reddy On Kavitha C

TRS Minister Jagadish Reddy Fires On BJP Over Kavitha Scam Issue: తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి.. అభివృద్ధికి నిలువరించాలన్నదే బీజేపీ ఎజెండా అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కావాలనే ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టాలన్నదే బీజేపీ వ్యూహమని, ప్రతీకార దాడులు జరిపించుకోవాలన్నదే ఆ పార్టీ పథకమని అన్నారు. ప్రతీకార దాడులు చేయించుకొని, దాన్ని సింపతీగా వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలు చేసేది వారే, దాడులకు దిగేది వారేనని ఆగ్రహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం ఉందని చట్టబద్ద సంస్థలు ఎక్కడా ప్రకటించలేదని, ఇదంతా బీజేపీ ఎంపీ (పర్వేశ్ శర్మ) సృష్టించిన రాద్ధాంతమని ఫైరయ్యారు.

కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని.. బీజేపీ నాటకం ఆడుతోందని జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అలజడికి బీజేపీ కుట్ర పన్నుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం చేపబడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్ని నిలువరించి, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన వ్యవహారం కూడా ఒక డ్రామానే అని వెల్లడించారు. భౌతిక దాడులకు టీఆర్ఎస్ దిగితే.. బీజేపీ అడ్రస్ గల్లంతు అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. అయితే.. సీఎం కేసీఆర్ ఆలోచన అది కాదని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. బీజేపీ పన్నుతున్న కుట్రల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.

Exit mobile version