Site icon NTV Telugu

KTR Tweet: మా ఫుల్ స‌పోర్ట్ సిన్హాకే.. కేటీఆర్ ట్వీట్

Ktr Yashwanth

Ktr Yashwanth

మాఫుల్ సపోర్ట్ సిన్హాకే అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఆసక్తి కరంగా మారింది. కాగా.. రాష్ట్రపతి అభ్యర్థిపై టీఆర్ఎస్ పార్టీ మరోమారు తమ మద్దతును స్పష్టం చేసిందనే వార్తలు గుప్పు మన్నాయి. ట్విటర్ వేదికగా తమ సపోర్ట్ ఎవరికో కేటీఆర్ స్పష్టం చేయడంతో.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. భారత రాష్ట్రపతి ఎన్నిక విషయమై యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని, మా పార్లమెంటు సభ్యులతో సహా.. నేను కూడా ఈ రోజు నామినేషన్‌లో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నానంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే.. యశ్వంత్ సిన్హా వచ్చే గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. కేంద్ర మాజీమంత్రి సిన్హాను జూన్ 21వ తేదీన ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. కాగా.. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన తర్వాత యశ్వంత్ సిన్హా పేరు వెలుగులోకి వచ్చింది. 21న మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన సిన్హా పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version