ఆ ఒక్క సీటులో గెలిస్తే.. కొత్తగా ఏర్పడేది లేదు.. ఉన్న సర్కార్ కూలేది లేదు.. కానీ, తెలంగాణ మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం చూస్తోంది… ఇక ప్రజల ఆసక్తి తగ్గట్టుగానే రౌండ్ రౌండ్‌కి ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతుండగా… హోరా హోరీ పోరు సాగుతోంది.. చివరి వరకు విజయం తనదే అంటున్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అయితే, ప్రతీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పెంచుకుంటూ పోతోంది… తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6317 ఓట్లు రాగా.. బీజేపీకి 5127 ఓట్లు వచ్చాయి. దీంతో, తొలి రౌండ్‌లో 1190 ఓట్ల ఆధిక్యం సాధించింది టీఆర్ఎస్.. అయితే, రెండో రౌండ్‌లో బీజేపీకి ఓట్లు పెరిగాయి.. టీఆర్ఎస్‌కు 7781, బీజేపీకి 8623 ఓట్లు రావడంతో.. అప్పటి వరకు టీఆర్ఎస్ లీడ్ 348 తగ్గింది.. ఇక, మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ మరింత తగ్గింది.. టీఆర్ఎస్‌కు 7387 ఓట్లు రాగా.. బీజేపీకి 7426 ఓట్లు వచ్చాయి.. దీంతో టీఆర్ఎస్ ఆధిక్యం 309కి పరిమితమైంది.
Read Also: Dr K Laxman: సీఎంఓ నుండి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా?
నాల్గో రౌండ్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ పుంజుకుంది.. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4855 ఓట్లు రాగా.. బీజేపీకి 4560 ఓట్లు వచ్చాయి.. దీంతో.. టీఆర్ఎస్ లీడ్ 608కి పెరిగింది.. ఇక, ఐదో రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగించింది గులాబీ పార్టీ… ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6062 ఓట్లు రాగా.. బీజేపీకి 5245 ఓట్లు పోల్ అయ్యాయి… ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం 1426 ఓట్లకు పెరిగింది.. మరోవైపు.. ఆరో రౌండ్‌లో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది టీఆర్ఎస్… ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 6016 ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి 5378 ఓట్లు సాధించారు.. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లతో కలసుపుకుంటే.. టీఆర్ఎస్‌కు 2,258 ఓట్ల మెజార్టీ వచ్చింది.. అయితే, బీజేపీ ఎక్కువ ఓట్లు వస్తాయని భావించిన చౌటుప్పల్‌లోనే దానికి నిరాశ ఎదురైంది.. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు ఆశిస్తున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. మునుగోడు మండల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. టీఆర్ఎస్ మెజార్టీ క్రమంగా పెరుగుతూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు..