Site icon NTV Telugu

Tragedy in Janagama: విషాదం.. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

Tragedy In Janagama

Tragedy In Janagama

జనగామ జిల్లా పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్‌ బాలిక బానోతు దీపిక, 22 సంవత్సరాల గుగులోతు రాజుగా గుర్తించారు. పల్లిప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చి అమ్మాయికి బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ప్రియుడు పురుగుల మందు తగినట్టు స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

read also: Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?

వీరిద్దరు నిజంగానే ప్రేమలో వున్నారా? లేక బాలికకు ప్రేమ ఇష్టం లేకపోయినా యువకుడు ఘటన తీసుకువచ్చి బలవంతంగా పురుగులు మంది తాగించి, తను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో విచారించనున్నారు. లేక వీరద్దరి ప్రేమకు ఇంట్లో ఒప్పుకోని కారణంగానే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా? అర్థరాత్రి 11 గంటలకు మైనర్‌ బాలిక ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇంట్లో ఎవరు లేరా? లేక బాలిక రానన్నా యువకుడే వచ్చి ఇంటి నుంచి తీసుకుని బయటకు తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడే తన కూతురుని బలవంతంగా పురుగుమందు తాగించి మృతికి కారణమయ్యాడని ఆరోపిస్తున్నారు. చేతికొచ్చిన తన కొడుకు కోల్పోయిన దుఖంలో వున్నామని యువకుడి తల్లిదండ్రులు వుండటం వారిని ప్రశ్నించిన తెలియదని చెప్పడం ఈఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోలీసుల సమాలోచనలో పడ్డారు. ఏదిఏమైనా రెండు నిండుప్రాణాలు ప్రేమ పేరుతో బలైపోయాయి. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Women IPL: మహిళల ఐపీఎల్ కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది ఉండే అవకాశం

Exit mobile version