NTV Telugu Site icon

Karimnagar Crime: జమ్మికుంటలో విషాదం.. అన్న తమ్ముల పిల్లలు ఒకేరోజు ఆత్మహత్య

Karimnagar Crime

Karimnagar Crime

Karimnagar Crime: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఎడ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనగర్‌ జిల్లా ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంగీత అనే యువతి కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. పలు ఆసుపత్రులలో వైద్య చికిత్స పొందుతున్నా కడుపునొప్పి తగ్గలేదు. సంతీత చివరకు ఆనొప్పని భరించలేక పోయింది. చావే సరణ్యమని భావించింది. తను అనుకున్నట్లు గానే ఇంట్లోనే వున్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాలుపడింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు సంగీతను హుటా హుటిన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సంగీత చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబం విషాదంలో వున్న సమయంలో మరొక గటన తీవ్రంగా కలిచివేసింది.

Read also: Sandhya Convention MD Arrest: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్.. కారణం ఇదే..

ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల భాస్కర్ అనే యువకుడు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొంతకాలంగా వైద్య చికిత్స పొందినా వ్యాధి తగ్గక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భాస్కర్‌ చివరకు ఇంట్లో వున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా భాస్కర్‌ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన ఇద్దరు సంగీత, భాస్కర్‌ ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముల పిల్లలు కావడంతో గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే చిన్నారు ఆత్మహత్యకు పాల్పడంపై తీవ్ర కలకలం రేపింది. మృతురాలి తండ్రి ఎడ్ల సుధాకర్, మృతుని తండ్రి ఎడ్ల తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Ghost Video: నడిరోడ్డుపై దెయ్యం.. చితకబాదిన బైకర్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

Show comments