హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా మినిస్టర్ రోడ్డులోకి వాహనాలు డైవర్షన్ తీసుకోవాలని సీపీ ఏవీ రంగనాథ్ సూచించారు. అదే మాదిరిగా బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్ ఆస్పత్రి మీదుగా మళ్లిస్తామని ఆయన తెలిపారు. అక్కడి నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా మినిస్టర్ రోడ్డులోకి వాహనాలు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదే మాదిరిగా బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్ ఆస్పత్రి మీదుగా మళ్లిస్తామన్నారు. వాహనదారులు ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌తో పాటు ఎన్టీఆర్ పార్క్, ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు
