NTV Telugu Site icon

Traffic Restrictions: నేడు కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Kukatpalli

Kukatpalli

Traffic Restrictions: సినీ దిగ్గజం దివంగత నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు నేడు కూకట్‌పల్లిలో జరుగుతున్నాయి. పార్టీలకతీతంగా జరిగే ఈ వేడుకల్లో వివిధ పార్టీల నేతలతో పాటు సినీ హీరోలు పాల్గొననున్నారు. కాగా ఈ వేడుకలకు దాదాపు 15000 నుంచి 20000 మంది సభ్యులు హాజరవుతారని సమాచారం. కూకట్‌పల్లిలోని ఖైతాలాపూర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు దృష్ట్యా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ కూకట్ పల్లిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Read also: Anti Dowry Act: బాబోయ్‌ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?

సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మూసాపేట నుంచి కేపీహెచ్‌బీ-IV ఫేజ్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలను మూసాపేట్ క్రాస్ రోడ్, కూకట్ పల్లి బస్టాప్, జేఎన్‌టీయూ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఐడీఎల్ లేక్ నుంచి మాదాపూర్ హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఐడీఎల్ జంక్షన్, కూకట్‌పల్లి బస్టాప్, కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1, జేఎన్‌టీయూ జంక్షన్ వైపు మళ్లిస్తారు. హైటెట్ సిటీ నుండి కూకట్ పల్లి, ముసాపేట్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను KPHB-IV ఫేజ్, లోథా అపార్ట్‌మెంట్స్, KPHB రోడ్ నెం.1 వైపు మళ్లిస్తారు. పర్వతనగర్‌, మాదాపూర్‌ నుంచి కూకట్‌పల్లి, ముసాపేట్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ సిగ్నల్‌, 100 అడుగుల సిగ్నల్‌ దగ్గర మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వారికి సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్‌ చేసుకోండి..