NTV Telugu Site icon

Venkaiah Naidu: నేడు నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Venkayyanaidu

Venkayyanaidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా.. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో నేడు రవీంద్రభారతిలో జరిగే ‘జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి’ జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

read also: Tragedy in Medak: విషాదం.. కొడుకు మరణం తట్టుకోలేక తల్లి బలవన్మరణం..!

శుక్రవారం సాయంత్రం 5:25 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 29లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి జూబ్లీ చెక్‌పోస్ట్‌, సాగర్‌ సొసైటీ, తాజ్‌ కృష్ణ, నిరంకారి జంక్షన్‌ నుంచి రవీంద్రభారతి వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అందువల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

అయితే నేడు బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం టీమ్ ఇండియాకు ట్విటర్ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. యావత్ దేశం యొక్క శుభాకాంక్షలు భారత బృందంలోని సభ్యులకు ఉన్నాయి. మీ అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశం గర్వపడేలా మీరందరూ కొనసాగాలని పేర్కొన్నారు.

Business Flash: 1000 మంది ఉద్యోగులను తీసేయనున్న ఓలా