Traffic changed: శ్రీరామ నవమి శోభా యాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు. పండుగ రోజున రాముడి ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు. వాహనదారులు పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. రేపు 30 మార్చి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా
* మధ్యాహ్న 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, పుర చౌరస్తా, ఘోడే కి ఖబర్.
* సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా.
* సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్.
* సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆఫ్ఘల్గంజ్ జంక్షన్, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా,
* సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా.
* రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్.
* రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తా వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని పోలీసులు సూచించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Cow vigilantes: కాళ్లు విరగ్గొడతాం.. మాంసం దుకాణాల వద్ద బీజేపీ నేతల హల్ చల్