Traffic Restrictions in Cyberabad: రేపు సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions In Cyberabad

Traffic Restrictions In Cyberabad

Traffic Restrictions in Cyberabad: రేపు సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొన‌సాగ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 25 వ తేదీన గ్యాథరింగ్ సైక్లింగ్ క‌మ్యూనిటీ మార‌థాన్ జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో.. సైబ‌రాబాద్‌లో ఉద‌యం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్షలు కొన‌సాగ‌నున్నాయి. అయితే.. ఈ సైక్లింగ్ మార‌ధాన్ లో సుమారు వెయ్యిమంది సైక్లిస్టులు పాల్గొనే అవ‌కాశం ఉందదని, సైక్లింగ్ సంఘం నిర్వాహ‌కులు పేర్కొన్నారు.

Read also: Flight on Road: గాల్లో విమానం రోడ్డుమీదకు.. ఏంటా కథ?

×
×
Ad

ఈనేపథ్యంలో.. ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోట‌రీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గ‌చ్చిబౌలి ర‌డ్డు నెంబ‌ర్ 45, దుర్గం చెరువు, జూబ్లిహిల్స్ ఇనార్బిట్‌మాల్, సీవోడీ జంక్షన్ త‌దిత‌ర ప్రాంతాల్లో సైక్లింగ్ మార‌థాన్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. కావున ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొన‌సాగుతాయని అధికారులు, నిర్వహాకులు పేర్కొన్నారు. రేపు ఉద‌యం 8 గంట‌ల త‌రువాత ట్రాఫిక్ యధావిధిగా ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ప్రతి ఏడాది గ్యాథ‌రింగ్ సైక్లింగ్ క‌మ్యూనిటీ సంస్థ సైక్లింగ్ మార‌థాన్ ను కండ‌క్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఏడాదికి ఈ పోటీలో పాల్గొనే సైక్లిస్టుల సంఖ్య పెరుగుతున్నట్లు నిర్వాహ‌కులు పేర్కొన్నారు.
Hyderabad Central University: విద్యార్థుల ఆందోళన.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ధర్నా