NTV Telugu Site icon

Hyderabad: పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు.. పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు

Moharama

Moharama

Hyderabad: మొహర్రం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోగా, వాహనదారులను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలపై హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఊరేగింపు సందర్భంగా బీబీ కా అలవా డబీర్‌పురా నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్, గుల్జార్ హౌస్, బీబీ కా అలవా రోడ్, షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, సూరజ్ టాకీస్, సర్దార్ మహల్, పంజేషా, మండి మీర్ ఆలం, పురానీ హవేలీ, దారుల్‌షిఫా, ఎతేబాజ్ చౌక్, అలీజా కోట్ల, మెస్కో, ఇమ్లిబాన్, చాదర్‌ఘాట్ మార్గాలను మళ్లిస్తారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Read also: Tomato: Paytm, ONDC ద్వారా టమాటాలు ఉచిత డెలివరీ.. కండీషన్స్ అప్లై..!

ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని, రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. కానీ హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం మొహర్రం ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అషుర్ఖానా బీబీ-కా-అలావా వద్ద ప్రారంభమై చాదర్‌ఘాట్‌లోని మస్జిద్-ఎ-ఇలాహి వద్ద ముగుస్తుంది. దాదాపు 11 కిలోమీటర్ల మేర జరిగే ఈ ఊరేగింపులో ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొంటారు. ఈసారి కూడా లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. శోభాయాత్ర కోసం రిహాల్సర్స్ ఇప్పటికే తీసుకున్నారు. ఊరేగింపు సందర్భంగా శనివారం సామాన్య ప్రజల కోసం చార్మినార్ సందర్శనలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ పోలీసులు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Jailer: ‘సూపర్ స్టార్’ తుఫాన్ కి సిద్ధమైన చెన్నై…

Show comments