NTV Telugu Site icon

Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Trafic

Trafic

Traffic Diversions: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజిగూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. హకీంపేట్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, బేగంపేట, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ మధ్య సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

Read also: Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

* శామీర్ పేట నుంచి ఓఆర్ ఆర్ మీదుగా మేడ్చల్ కు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. కొంపల్లి, సుచిత్ర, బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, లీ రాయల్ ప్యాలెస్ మధ్య లేదా శామీర్ పేట నుంచి కీసర, ఘట్‌కేసర్, ఉప్పల్ మీదుగా బిట్స్, హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.

* కరీంనగర్ మార్గంలో వచ్చే ప్రయాణికులు జేబీఎస్-అల్వాల్ మార్గంలో వెళ్లవద్దని, ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్-మేడ్చల్ లేదా ఘట్‌కేసర్ నుంచి కొంపల్లి, ఉప్పల్ వెళ్లాలని సూచించారు.

* మంగళవారం హకీంపేట్, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, సిటిఓ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ క్రాస్ రోడ్డు ప్రాంతాల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో ట్యాంక్‌బండ్ సాధారణ ట్రాఫిక్‌కు మూసివేయబడుతుందని పోలీసులు తెలిపారు.

* రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఈ నెల 30 వరకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శీతాకాల విరామ సమయంలో ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులను మోహరిస్తారు.

ద్రౌపది ముర్ము తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మైమానిక దళం శిక్షణా కేంద్రంలో సీఎం, గవర్నర్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.  తొలిసారిగా తెలంగాణకు వస్తున్న ద్రౌపది ముర్మును ఘన స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mangaluru: ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. మంగళూరులో 144 సెక్షన్

Show comments