Traffic Restrictions: దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జలవిహార్‌లోని బేబీ పాండ్స్, సంజీవయ్య పార్కులో విగ్రహాల నిమజ్జనం జరగనుంది. దుర్గామాత విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకుంటారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
* పంజాగుట్ట, రాజ్‌భవన్, ఖైరతాబాద్ ైప్లెవూరుకు వచ్చే వాహనాలు వివి విగ్రహం వద్ద సదన్ కళాశాల, నిరంకారి వైపు వెళ్లాలి.
* నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను పాత సైఫాబాద్ పీఎస్ వద్ద రవీంద్రభారతి మళ్లిస్తారు. అయితే అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఇక్బాల్ మినార్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉంది.
* ఓల్డ్ సైఫాబాద్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్రభారతి వద్ద లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
* ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తట్ల జంక్షన్ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలను తెలుగు తట్ల ఐప్లెవోర్‌కు మళ్లిస్తారు.
* అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
* మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట వంతెన వద్ద మళ్లిస్తారు.
* బుద్ధభవన్ వైపు నుంచి నల్లగుట్ట వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను మసీదు సోనాబీ అబ్దుల్లా వద్ద మినిస్టర్ రోడ్, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
* నాంపల్లి, కంట్రోల్ రూమ్ వైపు బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించరు. AR పెట్రోల్ బంక్ వద్ద ఉన్న రవీంద్ర భారతి MJ మార్కెట్ వైపు మళ్లించబడుతుంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?