NTV Telugu Site icon

Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..

Traffic Police

Traffic Police

Traffic Police: నగరవాసులు ఇక అలర్ట్‌ కావాల్సిందే. ఎందుకంటే.. ట్రాఫిక్‌ సిగ్నల్ జంప్‌ చేయడం, స్పీడ్‌ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడపడం వంటివి ఇకపై చెల్లవు అంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇక పగలు రాత్రి అనే తేడాలేకుండా సీసీ కెమెరాలే కాదు ఇకపై ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇకపై 24 గంటలు ట్రాఫిక్‌ పోలీసులు మీపై నిఘా ఉంటుంది. షిప్ట్ ల వారీగా మనపై నిఘా ఉండేందుకు పోలీసులు రాత్రికూడా డ్యూటీ చేయనున్నారు. ఈనేపథ్యంలో.. రాత్రి వేళలోనూ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. భాగ్యనగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం ట్రాఫిక్ రద్దీ లేని అర్థరాత్రి, ఉదయం సమయాల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఈ దూకుడుకు కళ్లెం వేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త పద్ధతి అనుసరించనున్నారు. ఈనేపథ్యంలో.. ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగించి అక్కడి ఫలితాలను విశ్లేషిస్తారు. ఈసందర్బంగా.. దీనిపై నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈనేపథ్యంలో.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పరిస్థితులు అదనపు సీపీ సుధీర్ బాబు పరిశీలించారు.

ముఖ్యంగా.. 35 కూడళ్లలో నిఘా..

అయితే.. ఇప్పటివరకూ ట్రాఫిక్ పోలీసులు ఉదయం 8. నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ఇకపై నగరంలోని 35 ప్రధాన కూడ ళ్లలో రాత్రి 8-12 గంటలు, ఉదయం 6-8 గంటల వరకూ విధులు నిర్వర్తించనున్నారు. రాత్రి 8-12 గంటల వరకు వీధుల్లో ఉన్న సిబ్బంది అర్ధరాత్రి 12. తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో విశ్రాంతి తీసుకుంటారు. తరువాత తిరిగి ఉదయం 6-8 గంటల వరకూ అదే కూడలిలో విధులు చేపడతారు. అనంతరం రోజు వారీ విధులకు వచ్చే సిబ్బంది రాగానే వీరంతా ఇళ్లకు చేరతారు. ఇక.. మొదటగా ఈ విధానాన్ని పంజా గుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, కేబీఆర్ పార్క్, ఏఎన్ఆర్ఎ సర్కిల్, బేగంపేట తదితర ప్రధాన కూడళ్లలో అమలు చేయనున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. అయితే.. మరోవైపు రద్దీలేని సమయాల్లోనూ నిబంధనలు పాటించని వాహనాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చాలానాలు పంపనున్నారు. వాహనదారులు ఇప్పుడు అలర్ట్‌ గా ఉండాలని, స్పీడ్‌ గా వాహనాలు నడపరాదని సూచించారు అధికారులు. సో వాహనదారులు బీ అలర్ట్‌.
Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

Show comments