Site icon NTV Telugu

Operation rope giving good results: సత్ఫలితాలిస్తున్న ట్రాఫిక్‌ నిబంధనలు.. అంతా దారికొస్తున్నారు

Operation Rope Giving Good Results

Operation Rope Giving Good Results

Operation rope giving good results: నగరంలో టాఫ్రిక్‌ రూల్స్‌ సత్ఫలితాలిస్తున్నాయి. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిపై కొరడా ఝురి చూపిస్తున్నారు అధికారులు. దీంతో వాహనదారులు ప్రతిఒక్కరు ట్రాపిక్‌ నియమాలు పాటిస్తున్నారు. గీత దాటితే అంతే అంటూ వస్తున్న వార్తలపై వాహనదారులు స్పందిస్తూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తున్నారు. గీత దాటిన వారిపై 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు ఆటంకం కల్పిస్తే వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించిన విషయం తెలసిందే. దీంతో వాహనదారులు బంబేలెత్తుతున్నారు. రాంగ్‌ రూట్‌ లో వచ్చిన వాహనాలను ఆపుతూ వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో మొన్ననే జరిగి ఓ.. ఘటనే నిదర్శనమని చెప్పాలి.

Read also: Suryalanka Beach Incident: సూర్యలంక బీచ్‌లో ఆరుగురు మృతి.. ప్రభుత్వం సీరియస్

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని ఓయువకుడి బైక్‌ నిలిపి బైక్‌ తాళాలు తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆగ్రహానికి గురైన బైక్‌ యజమాని బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలపెట్టాడు. అయినా సరే పోలీసులు వెనుకంజ వేయలేదు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిపై జరిమానా విధిస్తూ వారికి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. కొందరు వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా తమ వాహనాలను ఇష్టారీతిగా నడిపిస్తున్నారు. దీని.. ఫలితంగా ఇతరులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను సరైన రీతిలో నియంత్రించకపోతే బెంగళూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు హైదరాబాద్‌ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో.. పోలీసు అధికారులు ఆపరేషన్‌ రోప్‌ పేరిట ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించని వారిపై, నిఘా కెమెరాలకు చిక్కిన భారీ జరిమానాలు తప్పవని స్పష్ట చేస్తున్నారు. ఇక, ట్రాఫిక్‌ రద్దీని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, రోడ్లపై సజావుగా రాకపోకలు సాగించేలా సహకరించాలని పోలీసులు వాహనాదారులను కోరుతున్నారు.
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్‌ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో

Exit mobile version