Tragedy at Weddings: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
సంగారెడ్డి జిల్లా బాచారం గ్రామానికి చెందిన సొంగ రాము వివాహం గురువారం జరగాల్సి ఉంది. బుధవారం బంధువులు తమ కోడలిని తీసుకురావడానికి ట్రాక్టర్‌లో జోగిపేటకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో జెట్టిగారి సంగమ్మ, రావుగారి బూదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు చనిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
Read also: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
దీంతో మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నెల రోజుల క్రితం ఇదే స్థలంలో జరిగిన ప్రమాదంలో బాచారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం రోడ్డు ప్రమాదంలో బాచారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటు వరుడి, ఇటు వధువు కుటుంబాల్లోని పెళ్లిమండపాల్లో మృతదేహాలతో కన్నీరుమున్నీరవుతున్నారు.
Hyderabad: రంజాన్ మాసం.. చార్‌మినార్ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్