Mahesh Kumar Goud: అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పింఛన్లు, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రక్షణ శాఖలో అగ్నిపథ్ తీసుకొచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాలుగేళ్లకే రిటైర్ అవ్వడం అంటే పెళ్లికాగానే వితంతువు అయినట్లేనని ఆయన వర్ణించారు. నాలుగేళ్లలో 6నెలలు ట్రైనింగ్‌కే వెళ్తుందని.. ఆ 6 నెలల్లో ఏమి నేర్చుకుంటారని ప్రశ్నించారు. రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆక్రోశం వల్లే యువకులు బులెట్లు తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు.
డిఫెన్స్ నిధులకు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అదానీ పదింతలు పెరిగాడని.. ఎన్ని విధాలుగా సహకరిస్తున్నారని కేంద్రాన్ని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని అదానీకి తాకట్టుపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్‌ని వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. అగ్నిపథ్ నేపథ్యంలో దేశమంతా అట్టుడుకుతోందన్నారు. ఏం చదువుకున్నాడో తెలియని ప్రధాని ఉండడం మన దురదృష్టకరమన్నారు. జ్ఞానం లేని వ్యక్తి చేతిలో దేశం అడుగంటుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. మతతత్వ విధానాలతో ఓట్లు అడిగే పరిస్థితి ఉందన్నారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఆసుపత్రిలో ఉన్న సోనియాగాంధీ కూడా మద్దతు తెలిపి చనిపోయిన వ్యక్తికి సానుభూతి వ్యక్తం చేశారన్నారు. అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలని కార్యకర్తల నుంచి రాహుల్ గాంధీ వరకు కోరుతున్నామన్నారు. గతంలో మాదిరిగానే సైనిక నియామకాలు జరగాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబం దగ్గరకు కూడా అనుమతించలేదని ఆయన మండిపడ్డారు. శవంపై టీఆర్‌ఎస్ జెండాలు కప్పి ఊరేగింపు లాగా కాకుండా ఉత్సవాల లాగా చేసి రాజకీయం చేశారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Satyagraha Deekhsa Live Updates : సత్యాగ్రహ దీక్ష లైవ్ అప్డేట్స్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!