Site icon NTV Telugu

టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి : మహేష్ కుమార్

కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి.. ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అని తెలిపారు.

ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. టీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయం. మార్చి నాటికి పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మార్చి లోపు ఎవరు పార్టీ పదవుల నియామకాలు చేపట్టవద్దు అని చెప్పారు. ఒకవేళ అవసరం అయితే పీసీసీ అనుమతి తీసుకోవాలి అని చెప్పిన ఆయన టీఆర్ఎస్, బీజేపీలు రెండూ మా వ్యతిరేక పార్టీలే అని పేర్కొన్నారు.

Exit mobile version