Jagga Reddy:జగ్గారెడ్డి కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగం సమస్యని హైలైట్ చేయడం, నిరసన తెలపడం జగ్గారెడ్డికి నచ్చలేదు. తన బర్త్ డేకి కేసీఆర్ విషెస్ చెప్పారని, బర్త్ డే నాడు నిరుద్యోగం పై నిరసన తెలపడం ఏంటన్నారు జగ్గారెడ్డి. మరోవైపు పార్టీకి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో శుక్రవారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారి నుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్‌పై శనివారం ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం వుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రూపంలో తెలియజేయాలని జగ్గారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కొన్ని రోజులుగా చెబుతున్నారు.. తాను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారని ఆయన కలత చెందుతున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది జగ్గారెడ్డి ఒక్కరే. 2004లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2009, 2018 ఎన్నికల్లో గెలిచారు.. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు.. ఏదిఏమైనా జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడితే అది ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారానికి ఇటీవల జరిగిన పరిణామాలు కారణంగా చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డికి వచ్చినప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగారు.. కేటీఆర్ జగ్గారెడ్డికి మధ్య సంభాషణలు సాగాయి. దీంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది. ప్రస్తుతం జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా వుంటారా? రాజీనామా చేసి వేరే పార్టీలో చేరతారనేది హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!