NTV Telugu Site icon

Congress: తెలంగాణలోనే మొదట రాహుల్‌ గాంధీ పాదయాత్ర..!

Revanth Reddy

Revanth Reddy

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన పాదయాత్ర మొదట తెలంగాణలోనే చేయాలని తీర్మానం చేసింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.. రైతు డిక్లరేషన్‌తో పాటు.. రాహుల్‌ గాంధీ పాదయాత్రపై ప్రధానంగా చర్చించారు.. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్ రైతు డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజీవ్ గాంధీ వద్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని.. రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలి.. మే 21 నాడు ప్రతి ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలి.. 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు జరగాలి.. జూన్ 21 వరకు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని.. పీసీసీ అధ్యక్షులుగా తాను వరంగల్ జిల్లాలో జయశంకర్ స్వంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జనజగరన్ అభియాన్ యాత్ర కార్యక్రమాలు.. పెరిగిన ధరలపై కూడా కార్యక్రమంలో చేపట్టాలన్న ఆయన.. రాహుల్ గాంధీ చేపట్టబోయే పాదయాత్ర 100 కిలోమీటర్లు తెలంగాణలో మొదట చేయాలని కోరదాం అన్నారు.. అక్టోబర్ 2 నుంచి జరగబోయే రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట తెలంగాణలో చేయాలంటూ తీర్మానం కూడా చేశారు. తెలంగాణలో జరిగే అన్ని కార్యక్రమాలు దేశంలో తెలంగాణ మోడల్ అని పేరొచ్చినట్టు వెల్లడించారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ మోడల్‌గా డిజిటల్ మెంబెర్షిప్, వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ మోడల్‌గా పేరొచ్చింది.. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా తెలంగాణలో చేపట్టి హ్యాట్రిక్ కొడదాం అని పిలుపునిచ్చారు. అందరి కష్టంతో మనం ఇవన్నీ సాధించాం.. ఒక్క ఏడాది కష్టపడితే అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవచేయొచ్చు అన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.