TPCC Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
“గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు. అయితే, మేము చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాం. సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం సలహాదారు కాదు, ఆయన జిల్లా నుంచి వచ్చిన మంత్రి. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత ఆయనదే” అని అన్నారు.
“త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్ నిర్మించనున్నాం. బోధన్‌లో త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా స్థాపించబడనుంది. పనీ చేసే వారికి గుర్తింపు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరిని విమర్శిస్తూ, “42% బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ నోరు మెదపడం లేదు. దేవుడు పేరు మీద ఓట్లు అడిగే నేతలకు ప్రజలు భవిష్యత్‌లో తగిన బుద్ధి చెబుతారు” అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
MLAs Defection Case: సుప్రీంకోర్టులో సోమవారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
