TPCC Mahesh Goud : ఢిల్లీలో నిర్వహించిన బీసీ మహా ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను శంకించాల్సిన అవసరం లేదని, బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లోనే బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని, కోర్టు గడువు కారణంగానే పంచాయితీ ఎన్నికలకు వెళ్లినా, కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాను ఈ ధర్నాకు వ్యక్తిగతంగా కాకుండా పీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చానని, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారని, అయితే కేంద్రం ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చకుండా తొక్కి పెడుతోందని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి సిద్ధంగా ఉందని, బీజేపీ ఎన్ని రోజులు ఆపాలనుకున్నా అది సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు.
The Devil: దారుణమైన డిజాస్టర్’గా దర్శన్ ‘ది డెవిల్’
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని, ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశం అటకెక్కలేదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలన్నీ కలిసి కేంద్రంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చివరిగా, తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారని కుల సర్వే ద్వారా చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని గుర్తు చేస్తూ, బీసీ సంఘాలతో కలిసి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని గౌడ్ ప్రకటించారు.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
