Revanth Reddy: కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్న మాటలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధి పెంచుతామన్నారు. రైతు పండించిన పంట చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొంటామని తెలిపారు.
రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. ఏడాది లోపు ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ 500 కె ఇస్తామని, ఆడ బిడ్డలను ఆదుకుంటామన్నారు. ఆర్టీసీ బస్సులో ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణం ఉంటుందని త్వరలో ప్రకటిస్తామన్నారు. అచ్చంపేట నా నియోజక వర్గం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ పార్టీని గెలిపించే బాధ్యత మీదే అని రేవంత్ తెలిపారు. మీకు నేను అండగా ఉంటా అని తెలిపారు. నల్లమల అడవి బిడ్డలు.. కాంగ్రెస్ కి పట్టం కట్టాలని కోరారు. నా పరువు సమస్య కాదని, 14 సీట్లు గెలిపించి పాలమూరు పరువు నిలబెడదామన్నారు.
Read also: CM YS Jagan: అబద్దాలన్నీ నమ్మకండి.. మంచి జరిగిందా అనేదే ప్రామాణికంగా తీసుకోండి..
కేసీఆర్ దోపీడికి 4 కోట్ల ప్రజలు బలి అయ్యారని ఆరోపించారు. పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఇక కేసీర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. తెలంగాణను కేసీఆర్ నుంచి విముక్తి కలిగించెందుకే ఈ చేరికలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే అంటూ సంచలన వ్యాఖ్యుల చేశారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు తెలంగాణలో నూకలు చెల్లాయని అన్నారు. ఇక తెలంగాణను పాలించే అర్హత కేసీఆర్ కు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దారిదోపిడీ దొంగలు బిల్లా, రంగాలు హరీష్, కేటీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్నాడని, కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీర్ టీఆర్ఎస్ పెట్టారని ఆరోపించారు. 22 ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్ కు న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరమాలని రేవంత్ అన్నారు. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
TSRTC: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ‘టీ-9 టికెట్’
