తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డికి పగ్గాలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాం కనిపిస్తోంది. ఈ జోష్ ను ఇలానే కంటిన్యూ చేయడానికి పక్క ప్రణాళికతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతోపాటు తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా తన పాదయాత్రను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ నుంచి మొదలుపెట్టి.. అక్కడి నుంచి మొదలయ్యే తన పాదయాత్రను అదిలాబాద్ జిల్లాలో ముగించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు పార్టీ శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర!
