Site icon NTV Telugu

Revanth Reddy: జగ్గారెడ్డి ఇష్యూ టీకప్పులో తుఫాన్‌..!

తెలంగాణలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసిన ఆయన.. పార్టీలో ఉన్న పరిస్థితిని.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. పరోక్షంగా టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు.. ఇక, ఈ లేఖ రాసిన వెంటనే.. తాను కాంగ్రెస్‌ గుంపులో లేను అంటూ పేర్కొని చర్చకు తెరలేపారు.. త్వరలోనే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే, జగ్గారెడ్డి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇది మా కుటుంబ సమస్యగా వ్యాఖ్యానించారు.. కుటుంబం అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయని.. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని వెల్లడించారు.. ఇక, దీనిని మీడియా పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్న ఆయన.. గోతికాడ నక్కల్లాగా చూసే టీఆర్‌ఎస్ పార్టీ ఆటలు సాగవని స్పష్టం చేశారు.. మీడియాలో రాస్తుంటారుగా టీ కప్పులో తుఫాన్‌ అంటూ.. జగ్గారెడ్డి వ్యవహారం కూడా అలాగే సమసిపోతుందన్నారు.. కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు లేవు, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని.. జగ్గారెడ్డి కోసం టీఆర్ఎస్‌ చేసే ఆలోచనలు అడియాశలవుతాయి, ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు రేవంత్‌రెడ్డి.

Read Also: Jagga Reddy Letter: నేను ఇక కాంగ్రెస్‌ గుంపులో లేను..

Exit mobile version