NTV Telugu Site icon

Congress: టీపీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన

Tg

Tg

Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ట్రై చేస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్‌మున్షీలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు. ఈ ఉమ్మడి మీటింగ్ తర్వాత.. పార్టీ పెద్దలు నలుగురూ.. రాష్ట్ర నాయకులు ముగ్గురితో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు టాక్.

Read Also: Janmashtami 2024 special: భూలోక బృందావనం.. హైదరాబాద్‌లోని ఈ ఇస్కాన్‌ టెంపుల్ ప్రత్యేకతలు ఇవే..

కాగా, పీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలని రాష్ట్ర నాయకత్వం కోరినట్లు సమాచారం. ఆ తర్వాత రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పులు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసిన అనంతరం మంత్రి పదవులకు పేర్లు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికే పదవులు దక్కాయి.. మరో ఆరుగురికి చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో.. సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ ఒకేసారి పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Read Also: Kantara Chapter1: కాంతార కోసం ఎవరూ చేయని పని చేస్తున్న రిషబ్ శెట్టి.. ?

ఇక, పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్‌ల పేర్లను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆరు మంత్రి పదవుల్లో ప్రస్తుతం నాలుగు భర్తీ చేసి.. మిగిలిన రెండూ అలాగే ఉంచాలని ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు టాక్. ఈ నాలుగు పదవులకు ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్యల పేర్లు వినపడుతున్నాయి. విస్తరణలో కాంగ్రెస్ హైకమాండ్ ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సమాచారం. ఓబీసీల్లో బలమైన సామాజికవర్గాలుగా గుర్తింపు పొందిన ముదిరాజ్‌, యాదవ సామాజికవర్గాలతో పాటు ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Show comments