NTV Telugu Site icon

Muthyam Dhara: జలపాతం వద్ద చిక్కుకొన్న పర్యాటకులు సేఫ్.. కాపాడిన NDRF బృందం

Mulugu Hevy Rains

Mulugu Hevy Rains

Muthyam Dhara: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాంధర జలపాతాలను చూసేందుకు వెళ్లిన 60 మంది పర్యాటకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. మొత్తం 84 మంది పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లగా.. వీరిలో 24 మంది తిరిగొచ్చారు. 8 గంటలపాటు నీటిలో ఉంటూ కుండపోత వర్షంలో గడిపారు. అటవీలో చిక్కుకున్న పర్యాటకులను ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుండి క్షేమంగా వారి గమ్యస్థానాలకు ఈ తెల్లవారి జామున 4 గంటలకు పంపించామని పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ తెల్లవారు జామున NDRF, జిల్లాకు చెందిన గజ ఈతగాళ్ళ, రెస్క్యూ టీంలు , పోలీసులు, అటవీ శాఖ,రెవెన్యూ అధికారుల సహాకారంతో ఘటన స్థలం చేరుకొని 4 గంటలకు వాగు ఉధృతం నుండి సుమారు 60 మంది పర్యాటకులని దాటించి వెంకటాపురం మండల కేంద్రానికి జిల్లా అధికారులు తీసుకువచ్చారని తెలిపారు.

అనంతరం వెంకటాపురం మండల కేంద్రం నుండి వారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించారు. ముత్యం ధార జలపాతం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు దాటలేక అటవీలో సుమారు 60 మంది పర్యాటకుల చిక్కుకున్న సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంతరం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు, తక్షణం స్పందించారు. అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాల వద్దకు అటవీ శాఖ అధికారాల అనుమతి లేకుండా పర్యాటకులు వెళ్ళడం సురక్షితం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు .జలపాతాల వద్దకు వెళ్లేందుకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.

Read also: Kajal Agarwal : హాట్ డ్రెస్ లో దేవ కన్యలా మెరిసిన కాజల్..

బుధవారం సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పర్యాటకులు ములుగు జిల్లాలోని జలపాతాలను సందర్శించేందుకు వెళ్లగా.. మరికొందరు వీరబద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధర జలపాతాలను సందర్శించేందుకు వెళ్లి.. అక్కడి జలపాతాల్లో ఈత కొడుతూ ఆనందించారు. మార్గమధ్యంలో గగ్గేణి నది పొంగిపొర్లింది..మధ్యలో మరో రెండు కాల్వలు ప్రవహిస్తున్నాయి.. దీంతో పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు.. దిక్కుతోచని కేకలు వేశారు.. మొత్తం 60 మంది మాత్రమే అడవిలో చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరి సెల్‌ఫోన్లు పనిచేస్తున్నాయని..ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్నేహితులకు సమాచారం అందించారు..

ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కుండపోత వర్షంతో అతి కష్టం మీద.. దారిలో వరద పొంగి ప్రవహిస్తున్న తాడు సహాయంతో అడవిలోకి వెళ్లి వారిని రక్షించారు. 60 మందిని సురక్షితంగా వీరభద్రవరం తీసుకొచ్చారు.. వారికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు పంపించారు.. తమను కాపాడేందుకు కృషి చేసిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.. తమ ప్రాణాలను కాపాడిన గ్రామస్థులకు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అడవిలో ఎనిమిది గంటలపాటు నరకయాతన అనుభవించామని గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు.. ఇది మాకు పునర్జన్మ. మొత్తం మీద ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆ 60 మంది సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్లు