Site icon NTV Telugu

TOSS : అలర్ట్.. తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

Toss

Toss

TOSS : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన SSC , ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సవరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ప్రెస్ నోట్‌లో పేర్కొనబడిన ప్రకారం, అప్లికేషన్‌ల సమర్పణకు సంబంధించి గడువులను పొడిగించారు.

ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం, అభ్యర్థులు తమ అప్లికేషన్‌లను MeeSeva కేంద్రాలు లేదా అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండు దశల్లో అప్లికేషన్ సమర్పణకు అవకాశం కల్పించారు.

Lords Test: ఫలించని జడేజా పోరాటం.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయ కేతనం..!

నిర్దేశిత ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు గడువు: జూలై 31, 2025 వరకు
లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు గడువు: ఆగస్ట్ 1, 2025 నుంచి ఆగస్ట్ 28, 2025 వరకు

అభ్యర్థులు తమ అప్లికేషన్‌లను సమర్పించిన అనంతరం, మూడు పని రోజుల లోపు అవసరమైన ధృవపత్రాలను సంబంధిత AI (Accredited Institutions – స్కూల్‌లు/కళాశాలలు) కు సమర్పించాలి. అలాగే, ఈ ప్రకటనను రాష్ట్రంలోని అన్ని విద్యాశాఖాధికారులకు, కలెక్టర్లకు, జిల్లా విద్యాధికారులకు పంపించినట్లు కూడా నోటీసులో పేర్కొన్నారు. అప్లికేషన్ సమర్పణకు సంబంధించి వివరణలు, మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Off The Record: సాయిరెడ్డి గీతోపదేశం అర్ధం కావాల్సిన వాళ్ళకు అయిందా..?

Exit mobile version