ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3గంటలకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు.
జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ హెచ్చరిక
లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉంచారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్‌లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు. సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే ఈ హింస చెలరేగినట్లుగా కేంద్రం భావించింది. దీంతో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. అయితే జైలు నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తానని సోనమ్ హెచ్చరించారు.
ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. టూర్ వివరాలు ఇదిగో..
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈసారి మోడీ పర్యటన రాయలసీమల ప్రాంతంలో కొనసాగనుంది.. వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాని.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్లనున్న ప్రధాని మోడీ.. శ్రీశైలం మల్లికార్జునస్వామితో పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్న తర్వాత.. కర్నూలులో నరేంద్ర మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు.. జీఎస్టీ శ్లాబులలో కీలక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తెచ్చింది ఈ నేపథ్యంలో.. జీఎస్టీ సంస్కరణలపై కూటమి నేతలతో కలిసి రోడ్‌షోలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ.. ఈ రోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.. ప్రధాని మోడీ రోడ్‌షో సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నహాలు చేస్తున్నారట.. ఇక, ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి నారా లోకేష్. శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు. అయితే, ప్రధాని మోడీ ఏపీ టూర్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉంది..
తెలంగాణలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మూడు దశల్లో నిర్వహణకు స్టేట్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను రాష్ట్ర సర్కార్ కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే, హైకోర్టులో కేసులపై క్షుణ్ణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలక్షన్ కమిషన్ నివేదికలు తీసుకుంది. మొదటగా ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఈసీ యోచిస్తుంది.
ఈరోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు.. త్వరలోనే 6G, 7G కూడా వస్తాయి..
ఈ రోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన బీఎస్‌ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందన్నారు.. ఇక, ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారన్నారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని.. సరైన సమయంలో, సరైన వ్యక్తి, సరైన ప్రాంతంలో మోడీ ఉన్నారని అభినందించారు.. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు ఐటీ వెన్నెముకగా ఉండేది.. అలాంటి సమయంలో అమెరికాలో తిరిగి రాష్ట్రానికి ఐటీ వచ్చేలా కస్టపడి పని చేశాను.. బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినప్పుడు రాజకీయ నాయకులతో పని లేదని అన్నారు.. వారం రోజులు పవర్ ప్రజెంటేషన్ తయారీ చేసి ఇచ్చాను.. ఐటీ టెక్నాలజీ లో అనేక మార్పులతో అభివృద్ధి చేశాం.. అలాగే టెలికం రంగంలో మార్పులు తీసుకురావటానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు..
హైకోర్టు ఆదేశాలపై వైఎస్ జగన్ హర్షం.. “సత్యమేవ జయతే” అంటూ పోస్ట్..
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
డ్రోన్ల ద్వారా చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ
హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీ ఎస్ పరిసరాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. చాదర్‌ఘాట్‌లో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన కమిషనర్, స్థానికులకు నీటి మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. భవనాలపై చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం అందజేస్తున్న విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఎంజీబీ ఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో వరద ప్రవేశించిన ప్రాంతాలను కూడా కమిషనర్ పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా DRF సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!
ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో అపజయమే లేని భారత్.. ఆదివారం జరిగే ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు భారత్ చేతిలో ఓడిన పాక్.. ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. పాకిస్థాన్‌ను మూడోసారి చిత్తుచేసి టైటిల్ పట్టేయాలని బావిస్తోంది. అయితే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అభిషేక్ ఫీల్డింగ్ చేయలేదు. అతడి స్థానంలో రింకూ సింగ్ మైదానంలోకి వచ్చాడు. తొడ కండరాలు పట్టేయడంతోనే అభిషేక్ ఫీల్డింగ్ చేయలేదని తెలుస్తోంది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్‌కు రాలేదు. ఇక మ్యాచ్ చివర్లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టేందుకు ఎగిరిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు సైతం కండరాలు పట్టేసాయి. దాంతో తిలక్ కూడా మైదానం వీడాడు.
శాసనసభలో ఆమోదం పొందిన 6 చట్టాలకు శాసనమండలి ఆమోదం.. అవేంటంటే..?
శాసనసభలో ఆమోదం పొందిన 6 చట్టాలకు శాసనమండలి ఆమోదం తెలిపింది.. అంతర్జాతీయ వర్శిటీ ఏర్పాటు బిల్లు-2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది. న్యాయవిద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్శిటీ నిర్ణించనున్నారు. ఏపీ ప్రైవేటు వర్శిటీల (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం-2025 మండలి ఆమోదం పొందింది. ఏపీ వర్శిటీల సవరణ బిల్లు-2025కు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుష్టువ్యాధి అనే పదం తొలగించేందుకు చట్ట సవరణ చేపట్టానున్నారు. ఏపీ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం-2006 రద్దు బిల్లు ఆమోదమైంది.. ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీకరణ బిల్లు-2025కు ఆమోదం వేశారు.. సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదన కోసం చట్ట సవరణ చేశారు. ఏపీ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు-2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది.
తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు
తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే మామూలుగా లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ, కొడంగల్‌కు సీఎం తిరుపతి రెడ్డి అని ఆయన సెటైర్ వేశారు. ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ కూడా కాని ఆయనకు అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
