NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోటీకి వైసీపీ దూరం.. పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీ..!

గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండడం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కీలక సమీక్ష.. ఆ కేసుల్లో దర్యాప్తుపై ఆరా..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కీల కేసులపై దర్యాప్తు చేపట్టింది.. అయితే, ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? అంటూ ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి డీజీపీ సీఎస్‌ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమీక్షలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్త పాల్గొన్నారు..

మిథున్ చక్రవర్తికి బాలయ్య స్పెషల్ విషెష్

దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఎంపిక‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఈ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలయ్య మాట్లాడుతూ ” విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు.

టెస్టుల్లో టీమిండియా నయా రికార్టు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇదే మొదటిసారి!

టెస్టుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్టు నెలకొల్పింది. అత్యల్ప బంతుల్లో 50 పరుగులు చేసింది. కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ అరుదైన రికార్డును సాధించారు. దాంతో ఇంగ్లండ్‌ రికార్డు బద్దలైంది. గతంలో ఇంగ్లీష్ జట్టు 26 బంతుల్లో 50 రన్స్ చేసింది. భారత్ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కూడా ఇదే.

రోహిత్ శర్మ 6 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉండగా.. అతడి స్ట్రైక్ రేట్‌ 316.67ఆ ఉంది. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు బాదాడు. జైస్వాల్ స్ట్రైక్ రేట్‌ 230.77. ఖలీద్ అహ్మద్ ఒక ఓవర్‌లో 16 పరుగులు ఇవ్వగా.. హసన్ మహ్మద్ 2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.

తిరుమల లడ్డూ వివాదం.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుప్రీంకోర్టు

సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది.. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా? అని ప్రశ్నించింది.. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్‌ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని అడిగింది.. ఇక, లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు.. మైసూర్‌, ఘజియాబాద్‌ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్‌ ఒపీనియర్‌ తీసుకోలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు..

దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని, టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణమైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా బస్సు స్టేషన్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి, తద్వారా వారు ఈ పండుగను సుఖంగా జరుపుకోగలుగుతారు. అయితే.. హైద‌రాబాద్ శివారు నుంచి ద‌సరాకు ప్రత్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరుకు స‌ర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు. ప్రయాణికుల రాక‌పోక‌లకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ పేర్కొన్నారు.

వాహనాల అక్రమ రవాణా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి…

వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై అక్రమ రవాణా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా, పక్క దేశాలకు జరిగే ఎగుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీస్తున్నాయి. ఈ అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతుండటం ప్రజల మనస్సులో ఆందోళన కలిగిస్తోంది. పరిగి ప్రాంతంలో బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా జరగడం అధికారికంగా నిర్ధారితమైంది. ఇటీవల, పోలీసులు వాహనాల తనిఖీల్లో అవాంఛనీయంగా పట్టుబడిన బోర్ బండి లారీలు ప్రాధమిక అనుమతి పత్రాలు లేకపోవడం గమనార్హం. దాంతో, ఈ లారీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో, అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారస్తులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది.

టీమిండియా రికార్డుల మోత.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో సంచలనం

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది. 10.1 ఓవర్లలో భారత్ 100 రన్స్ చేసింది. గతంలో ఈ రికార్డ్ కూడా భారత్ పేరిట ఉంది. తాజాగా.. తన రికార్డును తానే బ్రేక్ చేసింది. వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో 100 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన భారత్.. ఇప్పుడు బంగ్లా పై 10.1 ఓవర్ల లోనే 100 చేసి మరో రికార్డు సృష్టించింది.

మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదు

మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఆందోళనలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసితుల భద్రత, పునరావాసం, కూల్చివేతలకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కమిషనర్ కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలు హైడ్రాకు సంబంధించినవి కాదని స్పష్టంగా అవగాహన చేయాలని కోరారు. ఈ సర్వేలు హైడ్రా చట్టం లేదా ప్రాజెక్టుకు సంబంధించినవి కాదని తెలిపారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను హైడ్రా తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. నివాసితులపై జరుగుతున్న ఇబ్బందులు తప్పనిసరిగా నివారించబడాలని హైడ్రా సంస్థ భావిస్తోందన్నారు.

ఆకట్టుకుంటున్న ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్‌…

మెగా అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. మావెరిక్ చిత్ర నిర్మాత శంకర్ షణ్ముఖం డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి పాట ‘జరగండి జరగండి’ సాంగ్‌ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చెప్పినట్లుగా చేసినట్లుగా, బృందం ఈ రోజు రెండవ సింగిల్ ను విడుదల చేసింది.