Heavy Rains : మెదక్ జిల్లా తూప్రాన్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులు, బట్టలు తడిసి పనికిరాకుండా పోయాయి. కొందరు స్థానికులు థర్మకోల్ షీట్లు వినియోగించి వరద నీటిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు, పిల్లలు సైతం ఇళ్లలో చిక్కుకుపోవడంతో జేసీబీలు, టిప్పర్ల సాయంతో వారిని బయటికి తీసుకువస్తున్నారు. నిన్నటి నుండి వరద కొనసాగుతున్నా, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
