KTR: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మూసాపేట మండలంలోని వేముల, మహబూబ్ నగర్, జడ్చర్లలో మూడు చోట్ల కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్‌తో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొంటారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలో ఏర్పాట్లను పరిశీలించారు.
Read also: Sri Sai Chalisa: శ్రీ సాయి చాలీసా వింటే మనోభీష్టాలను సిద్ధిస్తాయి
సెయింట్ ఫౌండేషన్ మరియు శాంతనారాయణగౌడ్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం, కేంద్రం నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. మార్చి నెలలో నిర్వహించే స్కిల్ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లోనే హాస్టల్ వసతి ఉందన్నారు. మహిళలకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించిన సెయింట్ ఫౌండేషన్ నిర్వాహకుడు ప్రద్యుమ్న, శాంతానారాయణగౌడ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహితలను అభినందించనున్నారు. యువజన సంక్షేమ శాఖ ఇప్పటికే జిల్లాలో 45 కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.
పర్యటన ఇలా..
* హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరనున్నారు.
* 9:15కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 10 గంటలకు హెలికాప్టర్‌లో భూత్పూర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
* ఉదయం 10:15 గంటలకు భూత్పూర్‌లోని మున్సిపల్ పార్కును ప్రారంభిస్తారు.
* 10:30 గంటలకు మూసాపేట మండలం వేములలోని ప్రైవేట్ కంపెనీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.
* 11 గంటలకు మహబూబ్‌నగర్ బాలికల ఐటీఐలో మైక్రో రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన, బహిరంగ సభ.
* మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలోని ఎర్రగుట్టలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటింటికి పరిచయం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు
Pakistan: పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?
Pakistan: పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?