NTV Telugu Site icon

Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..

Telangana Ministers

Telangana Ministers

Telangana Ministers: సీతారామ ప్రాజెక్ట్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాదించింది. ఈనేపథ్యంలో నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యాటించనున్నారు. ఖమ్మం నుండి చాపర్ లో బయలుదేరి సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీ నివాస రెడ్డి క్షేత్ర స్థాయి పరిశీలించనున్నారు. ప్రాజెక్టు వెంట 5 కిలోమీటర్లు పర్యాటించనున్న మంత్రులు. బిజి కొత్తురు, పూసుగూడెం పంపు హౌస్ ల పరిశీలించనున్నారు. పంపు హౌస్ ల ఎలక్ట్రికేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పై పవర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు అధికారులు వివరించనున్నారు. అనంతరం ఎన్కూర్ వద్ద వైరా లింజ్ కెనాల్ ను పరిశీలించి మంత్రులు తిరిగి హైదరాబాదు వెళ్లనున్నారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఓ చోట రిజర్వాయర్ నిర్మాణంకు సర్కారు ఆలోచనలో ఉంది.

Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు

ఇక 10_13 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం ఉండాలని భావిస్తోంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2లక్షల ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 1 .20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకం రూప కల్పనకు సిద్దమైంది. ప్రాజెక్టు పరిధిలో నాలుగు చోట్ల పంప్ హౌస్ లు నిర్మించారు. 16 ప్యాకేజీ లుగా విభజించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1_8 ప్యాకేజీ ల్లో 114 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాల్వ నిర్మాణం, సత్తుపల్లి ట్రంక్ పనులు 9_12 ప్యాకేజీ లుగా విభజించారు. కాల్వ పొడవు 116 కిలోమీటర్లు ఉంటుంది. యాతాలకుంట టన్నెల్, గండుగులపల్లి వద్ద నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. పాలేరు ట్రంక్ పనులు 13_16 ప్యాకేజీ ల కింద75 కిలోమీటర్ల పొడవు కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో పాలేరు నుండి మహబూబాబాద్‌ జిల్లా కు సాగు నీరు అందిచే క్రమమంలో అధికారులు సిద్దమవుతున్నారు.
Dear Nanna: డైరెక్ట్ ఓటీటీలోకి ‘డియర్‌ నాన్న’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?