Rahul Gandhi: తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ మధ్యాహ్నం 2.30 కి కల్వకుర్తి లో సభ పాల్గొంటారు. అనంతరం రాహుల్ సాయంత్రం 4.30 కి జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. అక్కడ నుంచి సాయంత్రం 6.15కిషాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి పాదయాత్ర .. చౌరస్తా లో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్లు ఉండటం వల్ల 2వ తేదీన తెలంగాణలో జరిగాల్సిన రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి నామినేషన్ల తర్వాత రాహుల్ గాంధీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్న కొల్లాపూర్‌లోని మహబూబ్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజానికి ప్రియాంక గాంధీ ఇక్కడికి రావాలని అనుకున్నారని, అయితే ఆమె రాజకీయ సంబంధాల వల్ల కాదని, కుటుంబ అనుబంధం వల్లే ఇక్కడికి వచ్చిందన్నారు. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నా.. వారి దగ్గరకు రావాలనే ఉద్దేశంతోనే వచ్చానన్నారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరుగుతుందని రాహుల్ అన్నారు. ఒకవైపు కేసీఆర్ కుటుంబం, మరోవైపు మొత్తం తెలంగాణ సమాజం, మహిళలు, నిరుద్యోగులు అని రాహుల్ అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని అన్నారు. ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని, అవినీతికి పాల్పడుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయన్నారు. తమది దొరల పాలన కాదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు భూములు పంపిణీ చేశారు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. ధరణి ఫోర్టల్ వల్ల తెలంగాణలో 20 లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబం, వారి ఎమ్మెల్యేలు మాత్రమే లబ్ధి పొందారని అన్నారు.
Telangana Elections: కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటన.. ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన అధికారులు
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!