Liquor Stores: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను బహిరంగంగా ఎంపిక చేస్తారు. ఈ లక్కీ డ్రా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, ప్రత్యేక అధికారుల సమక్షంలో కొనసాగుతుంది. మండలాలు, దుకాణాల ఆధారంగా ఓపెన్ డ్రా జరుగుతుంది. 33 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. విత్ డ్రా పేర్లను వెంటనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు, గుడుంబా, సొంత లేబుళ్లతో తయారు చేసిన నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం అరికట్టడం వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎక్సైజ్ టెండర్ల లఖేడ్రా ఏర్పాట్లపై ఆయన మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Read also: Gurukula Exam: గురుకుల పరీక్షలో సాంకేతిక సమస్య..? ఇంకా స్టార్ట్ కాలే..!
సోమవారం అన్ని జిల్లాల్లో వీడియో చిత్రీకరణ మధ్య కలెక్టర్ల సమక్షంలో లకీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు వెంటనే కేటాయింపు ఉత్తర్వులను అధికారులు అందజేస్తారని వెల్లడించారు. డ్రా నిర్వహించే ప్రాంగణంలోకి లైసెన్సులు, ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లాల్లోని సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 134 షాపులకు 10994 దరఖాస్తులు రాగా.. శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ లోని 100 మద్యం షాపులకు 10621 దరఖాస్తులు అందాయి. ఆసిఫాబాద్ లో 967 దరఖాస్తుదారులకు టోకెన్స్ కేటాయించారు. వైన్స్ టెండర్లలో రిజర్వేషన్లు, గౌడ్స్ 15%, ఎస్సి 10%, ఎస్టీలకు 5% కేటాయించారు. టోకెన్స్ డబ్బాలో వేసి ఒక్కో షాపుకు లక్కీ డ్రాను ఎక్సైజ్ అధికారులు నిర్వహించనున్నారు.
Bathing Timings: మనం రోజూ చేసే స్నానాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?