NTV Telugu Site icon

Bhadrachalam: నేడు భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం.. తలంబ్రాలు పంపిణీకి 60 కౌంటర్లు

Bhdarachalam

Bhdarachalam

Bhadrachalam: నేడు భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఎన్నికల నిబంధనలు వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకారని అధికారులు ప్రకటించారు. రామాలయం, పురవీధులు విద్యుత్ దీప కాంతులతో వెలుగుతున్న భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం ఏర్పాట్లు 60 కౌంటర్లో ఉచితంగా తలంబ్రాలు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. భక్తులకు అవసరమైన లడ్డూలు, పులిహారకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు పందిరితోపాటు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వేశారు. స్వామివారి కల్యాణోత్సవాలను వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాల్లో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. https://bhadradrit emple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read also: BSP Candidate List: 11మందితో లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను ప్రకటించిన బీఎస్పీ

మరోవైపు భద్రాచలం శ్రీ రామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ఆటంకం ఏర్పడింది. నేడు ఎన్నికల కమిషన్ నిబంధనల ఉన్నందున దేవదాయశాఖ ప్రత్యక్ష ప్రసారం లేదని స్పష్టం చేశారు. మిథిలా స్టేడియంలో మాత్రమే వీక్షకుల కోసం టీవీ ల ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరిన..అధికారుల్లో సమన్వయ లోపంతో ప్రత్యక్ష ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. భద్రాచలం పట్టణాన్ని పోలీస్ యంత్రాంగం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రాములోరి కళ్యాణానికి భక్తులు పోటెత్తడంతో గదులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట చూస్తే మండే సూరీడు, వుండటానికి గదులులేక భక్తులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి భక్తులకు ఉండటానికి స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Bhadrachalam: సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక..