బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. నేడు హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650లుగా ఉంది. దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.100 క్షీణించింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,980లుగా ఉంది.
అంతేకాకుండా హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది. అయితే.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు ఔన్స్‌కు 0.39 శాతం పడిపోయింది. 1831 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు 1.06 శాతం పడిపోవడంతో.. ఔన్స్‌కు 21.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
