Site icon NTV Telugu

తెలంగాణ కరోనా అప్డేట్…

corona

corona

తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,828 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్‌ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 247 కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,66,546 కి చేరగా.. రికవరీ కేసులు 6,58,170 కి పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,921 కి పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,455 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి అని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version