NTV Telugu Site icon

Kodanda Ram: కాళేశ్వరం ఖర్చు ఎక్కువ నీళ్లు తక్కువ

Kodan

Kodan

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కామారెడ్డిలో జలసాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తూ తూప్రాన్ బైపాస్ లో TJS అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడారు. నీళ్లు , నిధులు, నియామకాల్లో టీఆర్‌స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు.

ప్రగతి భవన్ లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. మిగతా వారు ప్రగతి భవన్ కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు నమోదు. ధర్నా చౌక్ లు ప్రభుత్వం ముయిస్తే కోర్టు ద్వారా తెరిపించాం. కాళేశ్వరం ఖర్చు ఎక్కువ నీళ్లు తక్కువ. 3700 కోట్ల వ్యయంకు గాను కేవలం ఏడువందల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగతా మూడు వేల కోట్లు మరుగున పడి ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయి.

కేసీఆర్ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెపుతారు. జూన్ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కోదండరాం. తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నించి కోదండరాం-కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ ఉద్యమంలో ఒక్కటై తిరిగిన నేతలు ఇప్పుడు ఎడమొహం-పెడ మొహంలా తయారయ్యారు.

Osmania Mortuary: రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటా.. !

Show comments