మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ సబ్ డివిజన్ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్తపులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. గ్రామల్లో పశువలపై దాడి చేస్తూ హల్‌చల్ చేస్తుండటంతో.. సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్ర లోని తడోబా అడవుల నుంచి సిర్సూర్ కాగజ్‌నగర్ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి.
read also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
అయితే ఈ క్రమంలో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగామారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పులుల కదలికలు అంతగా లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు తరలిపోయాయని భావిస్తున్న తరుణంలో గత 20 రోజుల నుంచి తూర్పు ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులితో మరోసారి అలజడి రేకెత్తింది. మహారాష్ట్ర నుంచి ప్రాణమిత మీదుగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటప్లి, నిల్వాయి రేంజ్ పరిధిలోని వెంచపల్లి అడవుల్లోకి సదరు పులి ప్రవేశించింది.
దీంతో బొప్పారం సమీపంలోని అడవుల్లో మేతకు వచ్చిన ఓ మేకపై దాడిచేయడంతో కొత్త పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఎదుల్లబంధం గ్రామానికి ఎందిన ఎదుల సతీష్,లచ్చయ్య అనే వ్యక్తులకు చెందిన ఆవు, దూడను హతమార్చడంతో కొత్తపులి ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అటవీ అధికారులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాలపైనే దృష్టిసారించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Rajasthan: నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి