Site icon NTV Telugu

Tiger Search: ఇటు వణికించే చలి.. అటు బాబోయ్ పులి..

Tiger Fear

Tiger Fear

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారంపై అధికారులు అలెర్ట్ అయ్యారు..జైనాథ్ మండలం హత్తిఘాట్ శివారులో కెనాల్ లో రెండు పులులు కనిపించడం అధికారులు పులుల కదలికలు కనిపెట్టేందుకు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.. వచ్చిన పులుల ఉనికి కోసం పది ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పది మంది సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నట్లు ఎఫ్ ఆర్ ఓ తెలిపారు. పులి రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. పులి కదలికల నేపథ్యంలో జనం ఎవరూ అటవీ ప్రాంతాల వైపు వెళ్ళ వద్దని హెచ్చరిస్తున్నారు. నిన్న కెనాల్ లో కనిపించిన రెండు పులులు ఎక్కడినించి వచ్చాయి.. వాటి కదలికలపై అధికారులు దృష్టిపెట్టారు.

Read Also: Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది..కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండగా చలి తీవ్రత పెరుగుతోంది..కొమురం భీం జిల్లాలో తాజాగా 11.2 డిగ్రీలుగా నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 12.2,ఆదిలాబాద్ జిల్లాలో 13.1.గా నమోదుకాగా నిర్మల్ జిల్లాలో 13.2 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు…ఏజెన్సీ ప్రాంతాల్లో మంచుదుప్పటి కప్పేస్తుంది..ఎటు చూసినా చలి మంటలే దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో అక్టోబర్ నెల చివరివారం నుండే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.

దీంతో చలి ప్రభావం పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. రాత్రి పూట ఉష్ణాగ్రతలు 12-13 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయాయని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో శీతాకాలంలో మరింతగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి ప్రభావం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం వుంది. చెవులకు రక్షణ కవచాలు, స్వెట్టర్లు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు అర్థరాత్రి వరకూ బయట తిరగకుండా చూడాలంటున్నారు.

Read Also: Malavika Mohanan: బెడ్ పై ఏ హీరో హాట్.. నోరు జారి బుక్ అయిన మాస్టర్ బ్యూటీ

Exit mobile version