NTV Telugu Site icon

Tiger Attack: సిరిసిల్లలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు..

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Tiger Attack: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి ఓ యువకుడిపై చిరుత దాడి చేసింది. ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలో చిరుత బీభత్సం సృష్టించింది. బొల్లారం నాగరాజు అనే రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసింది. పొలం సమీపంలో ఉన్న దూడపై చిరుత దాడి చేయడంతో దూడ మృతి చెందింది. చిరుతపులి దాడితో ప్రజలు, రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో మరో చిరుత కూడా సంచరిస్తోంది. కల్హేర్ మండలంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. ఈరోజు చింతల్ గడి సమీపంలో చిరుతపులి వాహనదారులకు కనిపించింది. కల్హేర్ మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

Read also: Bigg Boss7 Telugu : బిగ్ బాస్ ఫినాలే కి స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసే సెలెబ్రేటీలు ఎవరో తెలుసా?

తాజాగా.. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పులుల సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చీకోడు గ్రామానికి చెందిన రాజు అనే రైతు చిప్పళ్లపల్లి గ్రామ శివారులోని తన పొలం వద్ద కట్టివేసిన దూడ చిరుత దాడితో మృతి చెందింది. తెల్లవారు జామున రాజు పొలానికి వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత దాడి వల్లే దూడ మృతి చెందినట్లు గుర్తించారు. స్థానిక ప్రాంతాల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఒంటరిగా వ్యవసాయ పొలాలకు కూడా వెళ్లకూడదని తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని అన్నారు. అంతేకాకుండా.. కొన్ని నెలల క్రింతం సిరిసిల్ల జిల్లాలో చిరుత పదిరోజుల్లోనే వరుస దాడులు చేసింది. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చిరుతపులిల సంచారం రైతులతో పాటు గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది.

Read also: Guntur Kaaram: దిద్దుబాటు చర్యలా? మూడో పాట అప్పుడే బయటకి వస్తుందా?

పది రోజుల క్రితం వేణుగోపాలపూర్‌లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత గత రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి శివారులోని గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. రైతు పొలం దగ్గర గేదెను కట్టేసి ఇంటికి వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న పాదముద్రల ఆధారంగా చిరుతపులి దాడి చేసిందని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. మొదటి నుంచి గ్రామంలోని రైతులు తమ పశువులను పొలాల్లోనే ఉంచేవారని, గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తూ వరుస దాడులు చేస్తూ గేదెలు, దూడలను చంపడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Bigg Boss7 Telugu : బిగ్ బాస్ ఫినాలే కి స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసే సెలెబ్రేటీలు ఎవరో తెలుసా?