హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్‌కు ఆపిన అధికారులు ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో టికెట్ ఇన్‌స్పెక్టర్ ఆ ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ తీరుపై కండక్టర్, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదం జరిగింది.
ఆగ్రహంతో ఉన్న కండక్టర్, కొందరు ప్రయాణికులు టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య ఉద్రిక్తతను మరోసారి బయటపెట్టింది. లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
