Thummala Nageswara Rao:తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని మహిళా నాయకుల సన్నాహక సమావేశం ఇల్లందులో జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలన్నారు. బీజేపీ పార్టీ 400 సీట్లు అంటూ మ్యాజిక్ చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ రెండుసార్లు మోసం చేసి మూడోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తున్నాడని తెలిపారు.
Read also: Teja sajja : ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. మైండ్ బ్లాకయ్యేలా గ్లింప్స్..
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ తెలంగాణకు ఒక ప్రభుత్వ రంగ సంస్థను తీసుకురాలేదన్నారు. ఆంధ్రాలో విశాఖ తెలంగాణలో బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటూ మాజీ సీఎం కేసీఆర్ అనడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అని తెలిపారు. కేసీఆర్ మానసిక రోగిగా ఆ మాటలు అంటున్నాడు ఆ మాటలు అనడం సిగ్గుచేటన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు.
Read also: Shaykh Ismail : 40 ఏళ్లుగా హజ్ యాత్రికులకు ఉచితంగా టీ, కాఫీలు అందిస్తున్న ఇస్మాయిల్ కన్నుమూత
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినరెండు సంవత్సరాల్లోనే కుంగిపోయిన కేసీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మంచి మోయలేని భారాన్ని మోపారన్నారు. వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేటందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశించారు. మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడంలో రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో నేల పోషకవిలువలు ఆరోగ్యము గురించి తెలుసుకోవడానికి ‘’మట్టి నమూనా పరీక్ష ‘’ అలా ఉపయోగపడ్తుందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితికి వచ్చాయని, వాటిని వెంటనే పునరుద్దరింప చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సివుందని మంత్రి సూచించారు.
Read also: Pooja Hegde: సినిమాల్లేక ప్రేమలో మునిగి తేలుతున్న పూజ.. బాయ్ ఫ్రెండ్ ను చూశారా?
నేల స్వభావం రైతుకు తెలిసినప్పుడు దానికి తగ్గ పోషకాలను, సేంద్రీయ ఎరువుల ద్వారా, రసాయన ఎరువుల ద్వారా అవసరం మేరకు వాడుకొనే సౌలభ్యం వారికి అందుబాటులోకి తేవడం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో 9, ప్రాంతీయ భూసార పరీక్షకేంద్రo ఒకటి, మొబైల్ భూసార పరీక్షా కేంద్రo ఒకటి, వ్యవసాయ మార్కెట్ లలో 14 భూసార పరీక్షా కేంద్రాలున్నాయని, యాసంగి సీజన్ అయిపోవస్తున్నoదున్న, వచ్చే వానాకాలంలోపు మట్టి నమూనాలు సేకరించి ఆయా పరీక్షా కేంద్రాల సామర్ద్ధ్యం అనుసరించి, రైతులకు మట్టి పరీక్ష చేసి ఫలితాలు అందజేసేoదుకు ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా క్రొత్త సాంకేతికతతో ఈ మధ్యకాలంలో ప్రవేశ పెట్టిన మిని సాయిల్ టెస్టింగ్ కిట్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో కోపరేటివ్ సొసైటీల, ప్రవేట్ సంస్థల భాగస్వామ్యాoతో, ప్రయోగాత్మకoగా ఏర్పాటు చేసి అవకాశాలను పరిశీలించవల్సిందిగా సూచించారు.
PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్ శర్మకు స్పెషల్ మ్యాచ్!