Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 7.6కిమీ వరకు విస్తరించి వున్నందున నేడు, రేపు రాష్ట్రంలో.. తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకావం వుందని పేర్కొంది. ఈనేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ,15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్ వెళ్లే సర్వీసు రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసి వేసారు. వర్షాలకు ఈసీ, మూసీ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత వాసులకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
The majestic #Cumulonimbus ⛈️standing tall among cluster of #cumulus @CloudAppSoc https://t.co/o3oHAVOpZA
— Weather@Hyderabad 🇮🇳 (@Rajani_Weather) August 3, 2022
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!