Site icon NTV Telugu

Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rain

Telangana Rain

తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ తీరంలో కొనసాగుతూ వుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 7.6కిమీ వరకు విస్తరించి వున్నందున నేడు, రేపు రాష్ట్రంలో.. తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకావం వుందని పేర్కొంది. ఈనేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ,15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్ వెళ్లే సర్వీసు రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసి వేసారు. వర్షాలకు ఈసీ, మూసీ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత వాసులకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version