హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరోనా సమయం.. కొందరు వ్యక్తులు మహమ్మారి కూడా భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
పాతబస్తీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
suicide