Site icon NTV Telugu

Chepa Mandu : ఈ ఏడాది కూడా చేప మందు లేనట్లే..

Chepa Mandhu

Chepa Mandhu

ప్రతీ ఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందు కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్‌కు తరలివస్తారు. కరోనా కారణంగా చేప మందుకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ ఏడాది కూడా చేప మందును నిలిపి వేస్తున్నట్లు బత్తిని గౌరీశంకర్‌ వెల్లడించారు. ఈ ఏడాది అందజేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు.ఈ చేప మందు వేసుకోడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు.

హైదరాబాద్‌లో నివాసం ఉండే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాలుగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా చేపమందు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఈ సంవత్సరమైనా చేప మందు పంపిణీ చేస్తారనుకున్నారు. కానీ.. కోవిడ్‌ సమస్య అలాగే ఉండడంతో చేప మందు పంపణీ చేయడం వీలు కావడం లేదని బత్తిని గౌరీ శంకర్‌ వెల్లడించారు.

Exit mobile version