Site icon NTV Telugu

Local Body Elections : మూడో విడతలో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

Local Body

Local Body

Local Body Elections : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ విడతలో మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలకు గాను 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాల కోసం మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటాపోటీగా బరిలో నిలిచారు. కాగా, అనివార్య కారణాల వల్ల 11 సర్పంచ్ స్థానాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా..

సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు స్థానాల ఎన్నికలు కూడా అదే స్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. మూడవ విడతలో మొత్తం 36,434 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వీటిలో 7,916 స్థానాలు ఏకగ్రీవంగా పరిష్కారమయ్యాయి. మిగిలిన 28,406 వార్డు స్థానాల కోసం మొత్తం 75,283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దురదృష్టవశాత్తూ, 112 వార్డు స్థానాలు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

Andhra Girl Jailed in Hyderabad: ప్రేమించినోడి కోసం హైదరాబాద్‌కు యువతి.. పోలీసుల ఎంట్రీతో కటకటాల్లోకి..!

Exit mobile version