NTV Telugu Site icon

Kamareddy Master Plan: నేడు మూడో రోజు రైతుల ఆందోళన.. రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

Kamareddy Master Plan

Kamareddy Master Plan

Kamareddy Master Plan: కామారెడ్డి జిల్లాలో నేడు మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటన పై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత తో రేవంత్ పర్యటన డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు కలెక్టర్ తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో.. నిన్న రాత్రి కలెక్టరేట్ ముట్టడి తో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసు వాహనం ధ్వంసం ఘటనలో 20 మంది పై కేసులు నమోదు చేశారు.

Read also: BJP Meeting: నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్​గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్

బీజేపీ నేతలు కార్యకర్తలు, పలువురు రైతుల పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ముగ్గురు రైతులు చికిత్స పొందుతుంది. నేడు రైతులకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. అడ్లూర్ ఎల్లా రెడ్డి లో రైతులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నట్లు సమాచారం. అయితే నిన్న బండిసంజయ్‌ అరెస్ట్‌ తో ఉద్రికత్త నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్‌ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తారా? రైతులకు పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇస్తారా అనే ప్రశ్నలు చర్చకు దారితీస్తున్నాయి. ఇవాళ రైతుల ఆందోళనకు మూడు రోజుకు చేరింది. అయితే ఇప్పటి వరకు కూడా కలెక్టర్‌ స్పందిచక పోవడం.. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, కలెక్టర్‌ గానీ రైతులతో మాట్లాడకపోవడంతో రైతుల ఆందోళన మరింత పటిష్టంగా మారింది. అయితే దీనిపై రెండు రోజులముందు కేటీఆర్‌ మట్లాడిన విసయం తెలిసిందే. అధికారులపై కూడా మంత్రి సీరియస్‌ అయ్యారు. ఏమైనా ఉంటే అధికారులతో ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరారు మంత్రి. అయితే అదంతా పక్కనపెట్టిన రైతులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కొనసాగించారు. దీనికి మద్దతుగా టీ.కాంగ్రెస్‌ నేతలు, బీజేపీ పలికింది. దీంతో రైతుల ఆందోళనకు మరింత బలం చేరుకుంది. మరి ఇవాళ చేపడుతున్న రైతుల ఆందోళనకు రేవంత్‌ వెళ్తారా? అనేది ఉత్కంఠంగా మారింది.
Naga Babu: నీది నోరా మున్సిపాలిటీ కుప్పతొట్టా ? రోజా పై నాగబాబు ఫైర్..

Show comments